వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు
అనంతపురం బ్యూరో (అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీ.రమేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిపిఐ నేతలు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ, ఎఐటియుసి నాయకులు రమేష్ ను కలిసి ఆయనకు విజయాభినందనలు తెలిపారు.
మేయర్ అభ్యర్థి సి.రమేష్ కలిసిన వారు.. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు, సిపిఐ నాయకులు నాగేష్ తదితరులు ఉన్నారు.
మేయర్ అభ్యర్థిగా సి.రమేష్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మేయర్ పదవికి ఈసారి ప్రత్యక్ష ఎన్నిక జరగనుండడం వల్ల ప్రజల మద్దతు కీలకమవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
రమేష్ పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ విశేష సేవలు అందించారని, అనంతపురం నగర అభివృద్ధికి అవసరమైన అంశాలపై దృష్టి సారిస్తారని సిపిఐ నేతలు నమ్మకం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా కార్మిక వర్గాలు, ప్రజలందరినీ ఏకమవ్వాలని వారు కోరారు.
ఈ సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ మాట్లాడుతూ.. తనపై ప్రజలు, పార్టీ నేతలు, వివిధ వర్గాల నేతలు చూపుతున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నగర ప్రజల సమస్యల పరిష్కారానికి, సమగ్ర అభివృద్ధికి తాను అంకితమవుతానని ఆయన హామీ ఇచ్చారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.