విజయవాడ నుంచి తిరుపతికి గ్రీన్ కారిడార్‌తో పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి గుండె చేరవేత
రేణిగుంట మేజర్ న్యూస్: విజయవాడ నుంచి తిరుపతికి గుండెను ప్రత్యేక విమానంలో తరలించారు. విజయవాడ నుంచి ఫ్లై 91 ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన గుండె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్డు మార్గంలో తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. గుండెను నిర్ణీత సమయంలో ఆసుపత్రికి చేర్చేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మార్గమధ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవయవ తరలింపు ప్రక్రియలో పోలీసు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి, గుండెను సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.