విజయదశమి స్ఫూర్తితో ప్రతి అడుగూ విజయపథంలో సాగాలి
• టిడిపి ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ :
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో నూతనోత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసి పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం లభించి ప్రతి రైతు ఇంటా విజయదశమి వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.