BREAKING
క్యూ2 ఫలితాల అప్‌డేట్: ఇరెడా నికర లాభం స్థిరం.. వారీ రెన్యూవబుల్ లాభంలో 37% క్షీణత.. బజాజ్ ఫైనాన్స్ ఎన్‌ఐఐ 24% జంప్! స్పేస్‌ఎక్స్‌లో మస్క్ $10.5 బిలియన్ల భారీ చెల్లింపు: ఆయన వాటా ఎంత? తాజా విక్రయం ప్రభావం ఎంతవరకు? టాటా ట్రస్ట్స్‌ వివాదం: చారిటీ కమిషనర్‌కు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ సమాధానం.. వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఫిర్యాదులపై కీలక ముందడుగు! ఐడీబీఐ బ్యాంక్ మెగా డీల్‌తో ఫెయిర్‌ఫాక్స్ $2.3 బిలియన్ల లిక్విడిటీపై పరిమిత ప్రభావమే: మూడీస్ విశ్లేషణ! బొగ్గు దిగుమతుల ప్రతిపాదనను పక్కనబెట్టిన కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు, రూపాయి క్షీణతే కారణం! క్యారెక్టర్‌.ఏఐ దివాలా.. ఉద్యోగులను తీసుకునేందుకు డిస్నీ $60 మిలియన్ల డీల్! మార్కెట్ పతనంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు: సులభతర ఎగ్జిట్‌లు, మిగులు లిక్విడిటీయే కారణం! ది లిక్విడిటీ పారడాక్స్: మిగులు నగదు నిల్వలే స్టాక్ మార్కెట్ల వేగవంతమైన పతనానికి కారణమా? నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల విశ్లేషణ! 8వ వేతన సంఘం: గతంలో 14%.. ఇప్పుడు 140% పెంపు డిమాండ్! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పాత రికార్డులు ఏం చెబుతున్నాయి? టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు: జాతీయ భద్రత పేరిట డ్రాగన్ నిర్ణయం.. భారత మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం! తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా బెల్లం మాధవి: అభినందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న! బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌

కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి

Select Suryaa Now
కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి

వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడితో కడపలో కలకలం.

 

 కడప నగరంలో మంగళవారం తెల్లవారుజామున కడప మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై  గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో, రాళ్లతో, బీరు సీసాలను ఇంటిలోకి విసిరేయడంతో ఇంటి అద్దాలు కిటికీలు ధ్వంసం అయ్యాయి.  శబ్దాలకు ఉలిక్కిపడి లేచిన బండి దీప్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పోలీసులు ఆరా తీశారు. సందర్భంగా మేయర్ అభ్యర్థి బండి దీప్తి మాట్లాడుతూ నామినేషన్ పరిశీలన పూర్తయిన వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడడం భయభ్రాంతులకు గురి చేస్తే ప్రచారాలకు వెళ్లకుండా అడ్డుకోవడం లాంటి కార్యక్రమం అని అన్నారు. ఇలాంటి దౌర్జన్య పాలన కొనసాగించి అభ్యర్థులను బరిలో లేకుండా చేయాలని ఉద్దేశంతోనే కూటమి నాయకులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

నంబర్ ప్లేట్లు లేని స్కార్పియోలో 

ఆరుగురు వ్యక్తులతో  వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. ఎన్నికలు అయిపోయేంతవరకు పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బండి దీప్తి కోరారు.దాడికి పాల్పడింది ఎవరు పోలీసుల విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని ఆమె కోరారు.

 కడప, ప్రతినిధి, వేణు.