BREAKING
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధారల ప్రత్యేక పైలాన్

Select Suryaa Now
ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధారల ప్రత్యేక పైలాన్

• రూ. 30,156 కోట్ల తాగు నీటి ప్రాజెక్టుల వివరాలతో అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు

• పైలాన్‌ను ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి : 

రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకి సంబంధించిన ప్రత్యేక పైలాన్ ను ప్రొద్దుటూరు పట్టణంలోని, అమృత్ నగర్ కూడలిలో  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కలసి ఆవిష్కరించారు.  జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ద్వారా చేపడుతున్న భారీ తాగునీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఈ పైలాన్ ను ఏర్పాటు చేశారు. రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న తాగునీటి సరఫరా, సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు, మల్టీ విలేజ్ స్కీమ్స్, గ్రామీణ నీటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఈ పైలాన్‌లో పొందుపరిచారు. అందులో గండికోట జలాశయం నుంచి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,000 గ్రామాల్లో చేపట్టిన సింగిల్ విలేజ్ స్కీమ్స్, 28 జిల్లాల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో ఫలకాలపై చెక్కారు.  ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు చేర్చాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార పనులను ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థనరెడ్డి, స్థానిక శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.