BREAKING
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని

ప్రతి ఓటరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

Select Suryaa Now
ప్రతి ఓటరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరూ దాని ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో టెంట్లు ఏర్పాటు చేయరాదని, 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లకు పంపిణీ చేసే ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు, పార్టీ చిహ్నాలు ఉండరాదని తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లేటప్పుడు ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా ధరించాలని, పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధులకు ఆటంకం కలిగించడం, అధికారులపై కేకలు వేయడం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ ఏజెంట్లపై ప్రిసైడింగ్ అధికారులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను నిశితంగా పరిశీలించేందుకు నీడ రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐఎన్‌సీ నుంచి బి. మురళీకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పి. హరికృష్ణ, సీపీఎం నుంచి డి.వి. కృష్ణ, వైఎస్సార్‌సీపీ నుంచి పి. రాజశేఖర్, వి. యశోధర్, టీడీపీ నుంచి బి. అనిల్, బీఎస్పీ నుంచి బి. కిరణ్, జనసేన పార్టీ నుంచి జె. శ్రీనివాస్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.