BREAKING
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు... మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి

ప్రమాదకరంగా మారిన కేశవరం రైల్వే గేట్

Select Suryaa Now
ప్రమాదకరంగా మారిన కేశవరం రైల్వే గేట్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

మండపేట మండలం కేశవరం వద్ద ఉన్న రైల్వే గేటు వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రైళ్ల రాకపోకల కారణంగా తరచూ గేటు పడుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో కొందరు ద్విచక్ర వాహనదారులు గేటు మూసి ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా గేటు దాటుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాపాయం తప్పదని తెలిసినా కొందరు వాహనదారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

శనివారం కేశవరం రైల్వే గేటు వద్ద చిన్నారులు, మహిళలతో పాటు భారీగా సామగ్రిని తీసుకెళ్తూ ఓ ద్విచక్ర వాహనదారుడు మూసి ఉన్న గేటును దాటే ప్రయత్నం చేయడం కనిపించింది. పిల్లలను వెంటబెట్టుకుని ఇలా ప్రమాదకరంగా గేటు దాటడం వారి ప్రాణాలను ముప్పులోకి నెట్టడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రైల్వే గేటు వద్ద వాహనదారులు నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం.…

మండపేట, రామచంద్రపురం, అనపర్తి నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం వెళ్లేందుకు ద్వారపూడి, కేశవరం, బొమ్మూరు మీదుగా ఉన్న ఈ రహదారినే ప్రధానంగా వినియోగిస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో కేశవరం రైల్వే గేటు వద్ద తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

2009లోనే నిధులు మంజూరు అయినా ప్రారంభం కాని పనులు.…

కేశవరం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2009లోనే నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం చొరవ తీసుకుని కృషి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు పలుమార్లు కేశవరం ప్రాంతాన్ని సందర్శించి స్థల పరిశీలన చేపట్టడంతో పాటు భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే భూసేకరణ ప్రక్రియలో ఆశించిన పురోగతి కనిపించకపోవడం, నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోవడం ప్రజల్లో నిరాశకు కారణమవుతోంది.

2027 పుష్కరాల నాటికైనా పూర్తయ్యేనా?.…

గోదావరి పుష్కరాల సమయంలో ఈ మార్గంలో రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున కేశవరం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భూసేకరణలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించి, నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు, నిధులు, ఇతర ఏర్పాట్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో రైల్వే గేటు వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, 2027 గోదావరి పుష్కరాల నాటికైనా ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని  ప్రజలు కోరుతున్నారు.