BREAKING
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....! సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.

ప్రకాశం జిల్లాలో మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
ప్రకాశం జిల్లాలో  మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా  ఎలక్షన్స్ నోడల్ అధికారి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్ గౌరవ ఎం. వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు.

????గౌరవ జిల్లా అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించి, ఏవైనా ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

????  ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మరియు  గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ రాజా బాబు IAS  వారి ఆదేశాల మేరకుఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహనతో, సమయపాలన మరియు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో వివరించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

???? శిక్షణలో ముఖ్యాంశాలు: ✅ మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలు.
✅ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు.
✅ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ.
✅ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు.
✅ ఎన్నికల ఉల్లంఘనలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదించడం.

???? ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్లు కీలక పాత్ర పోషించాలని అధికారులు పిలుపునిచ్చారు.