సీఎం చంద్రబాబు సారథ్యంలో పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే నసీర్ దిశానిర్దేశం
గుంటూరు న్యూస్: నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. శుక్రవారం స్థానిక తూర్పు కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ ను కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ కార్పొరేటర్లు ఎమ్మెల్యే నసీర్ దిశా నిర్దేశం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే డివిజన్లో సమస్యలను గుర్తించాలని చెప్పారు ప్రతి సమస్య పరిష్కారానికి పక్క ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సమస్యలు ఏ అధికారి వద్దకు తీసుకెళ్తే పరిష్కారం అవుతాయో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు నగరాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్పొరేటర్లు ముందంజలో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ప్రభుత్వాధికారులు దృష్టికిగానీ, మా దృష్టికిగానీ వెంటనే తీసుకురావాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందేలా చూడాల్సిన బాధ్యత కార్పోరేటర్లదేనని స్పష్టం చేశారు . నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే నసీర్ సారథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.