BREAKING
ఇటలీలో బద్ధలైన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రమదానం రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం

Select Suryaa Now
ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం

*ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం*

డి ఎమ్ హెచ్ వో డా పి.కోమలి 

ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసీ సిబ్బంది అందిస్తున్న సేవలు అత్యంత కీలకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. కోమలి అన్నారు. ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఫార్మసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.శుక్రవారం స్థానిక డి ఎమ్ హెచ్ వో కార్యాలయం లో అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా డా పి కోమలి మాట్లాడుతూ అత్యవసర ప్రాణరక్షక మందులు, టీకాలను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో భద్రపరచడంతో పాటు మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా మందుల కొరత లేకుండా చూడటంలో ఫార్మసీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గడువు తీరిన, నాసిరకం మందులను గుర్తించి సురక్షితంగా తొలగించడం ద్వారా రోగుల భద్రతకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

డాక్టర్లు సూచించిన మందులను నిర్ణీత సమయానికి, సరైన మోతాదులో వినియోగించేలా రోగులకు అవగాహన కల్పించడం, వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వినియోగించకుండా ప్రజలను చైతన్యపరచడం ఫార్మసిస్టుల బాధ్యతల్లో ముఖ్యమైనవని ఆమె తెలిపారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా ప్రోత్సహించడంతో పాటు, యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడంలోనూ ఫార్మసిస్టులు చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. జిల్లా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అహర్నిశలు సేవలందిస్తున్న ఫార్మసీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని కలిసిన ఫార్మసీ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, జైలుద్దీన్, మూర్తి, పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు

---