BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

ప్రజా విశ్వాసానికి ప్రతిరూపం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు

Select Suryaa Now
ప్రజా విశ్వాసానికి ప్రతిరూపం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు

 

- కూటమికి అఖండ మద్దతు తెలిపిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. 
శ్రీకాకుళం 
నవంబర్ 03 మేజర్ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతుగా నిలిచి, తమ విలువైన ఓట్లతో ప్రజా తీర్పును అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  భాగస్వామ్యంతో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల మద్దతును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో విజయాలు నమోదు చేయడం, మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడం సంతోషకరమన్నారు.

అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ముఖ్యమైన ఇచ్చాపురం, పలాస మున్సిపాల్టీలను సైతం కూటమి కైవసం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూటమి ఖాతాలో ఇచ్చాపురం మున్సిపాల్టీ రావడంతో పాటు, ప్రతిష్టాత్మక పలాస లో సైతం స్పష్టమైన మెజారిటీ తో జయకేతనం ఎగురవేయడం శుభపరిణామం అని అన్నారు.

ఈ విజయాల కోసం కృషి చేసిన కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఆధునిక పట్టణీకరణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు కృషి చేయాలని విజేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారితో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.