ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5న అర్జీల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5న అర్జీల స్వీకరణ
మచిలీపట్నం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించిందని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ‘మీకోసం’ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని మండల లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. ప్రజలు 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి అర్జీలు నమోదు చేసుకోవడంతో పాటు వాటి స్థితిని తెలుసుకోవచ్చని, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. QR కోడ్ ద్వారా కూడా స్పందన తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. ఆర్టీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్‌లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.