BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సర్వాంగీణ వికాసమే 'విద్యా వికాసం–విద్యా వాహిని' లక్ష్యం: మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సర్వాంగీణ వికాసమే 'విద్యా వికాసం–విద్యా వాహిని' లక్ష్యం: మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

 

ధర్మవరం, సెప్టెంబరు 30:

ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని అందించడమే 'విద్యా వికాసం–విద్యా వాహిని' కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. సత్యకుమార్ యాదవ్ చొరవతో, సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బుధవారం సాయంత్రం ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద ఉన్న భగత్ సింగ్, అల్లూరి విద్యా వికాసం కేంద్రాలను హరీష్ బాబు సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అందుబాటులోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధర్మవరం అర్బన్, రూరల్‌‌తో పాటు బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో మొత్తం 30 ఉచిత విద్యా వికాసం కేంద్రాల ద్వారా 843 మంది విద్యార్థులకు, అలాగే 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా వాహిని కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.