ప్రభుత్వ భూములు అక్రమిస్తే కఠినచర్యలు
సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరైనా అక్రమించుకుంటే ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ధర్మతేజ అన్నారు.గురువారం మండలంలోని గుంతచెన్నంపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్ 234లో సుమారు 400 ఎకరాలకు సంభందించిన ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు అక్రమించుకుని నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి సాగు చేసుకొంటున్నారని ఇటీవల గ్రామానికి చెందిన పలువురు పిజిఆర్ఎస్ గ్రీవెన్ సెల్ ఫిర్యాదు చేయడంతో గురువారం గ్రామానికి వెళ్లి గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా సర్వేనెంబర్ 234 భూమిని సాగు చేస్తున్న రైతులు తమకు సంభందించి ఆధారాలు సమర్పించాలని తెలిపారు. పలువురు రైతులు తమవద్ద ఉన్న ఆధారాలను రెవెన్యూ అధికారులకు అందజేశారు.ఈకార్యక్రమంలో తహశీల్దార్ ధర్మతేజ, విఆర్ఓ ఓబులపతి, గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.