BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నికల సిబ్బంది

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నికల సిబ్బంది

- జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం సూర్య ప్రతినిధి :
పోలవరం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు హాజరుకానున్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కుంటున్నారు.ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 895 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. నవంబర్ 29వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరుకావాల్సిన అధికారులు, సిబ్బందికి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో బాధ్యతాయుతంగా పాల్గొంటూనే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి సిబ్బంది ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎన్నికల విధుల కారణంగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయలేని సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 895 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కున్నారని తెలిపారు. ఇంకా కొంతమంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వేచి ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.