BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

పొన్నూరు మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు

Select Suryaa Now
పొన్నూరు మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు

 పొన్నూరు మేజర్ న్యూస్:-2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పొన్నూరు మండలంలోని మన్నవ మరియు దొప్పలపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సంయుక్తంగా క్షేత్రస్థాయిలోపరిశీలించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై వారు ఆరా తీశారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు తదితర సౌకర్యాలను పరిశీలించి, లోపాలను సవరించాలని సూచించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులనుఆదేశించారు. పోలింగ్ రోజు ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ మహమ్మద్ జియావుల్  హక్ , ఎంపీడీవో గుమ్మ చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- సిలార్