శ్రీకాళహస్తి పట్టణంలో పోలింగ్ కేంద్రాలను శ్రీకాళహస్తి డిఎస్పి ఈ పావని ఆదివారం పరిశీలించారు. శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగింది . బీపీ అగ్రహారం, విఏంపల్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని, ఎలాంటి నేరాలు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఒకటవ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశు, రెండవ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.