BREAKING
కూరకులపల్లి లో వైయస్సార్ విగ్రహం వస్త్రానికి నిప్పు కేసు నమోదు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! పొలం బడి కార్యక్రమంలో ఫీల్డ్ డే నిర్వహణ : బొబ్బిలి ఎంపిపిగా బొబ్బిలి సునీన ఏకగ్రీవంగా ఎన్నిక రేడియల్ రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి:పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ అచ్చంపేటలో ఎల్ నినో పై ప్రత్యేక గ్రామసభ గజపతినగరం ఎంపీపీగా గంట్యాడ శ్రీదేవి ప్రమాణ స్వీకారం యావపూర్ లో మహిళా సంఘం నూతన భవనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. ఎమ్మెల్యే " కోండ్రు " టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివా ళులు అర్పించిన మండల్ కాంగ్రెస్ నాయకులు శర్వానంద్ భోగి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న థియేటర్లలో మాస్ జాతర! ఎంపీపీగా దన్నాన పద్మావతి అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడికి మరింత కఠిన చర్యలు అవసరం.. డిసెంబరులో 0.50 శాతం వడ్డీ పెంపునకు ఫెడ్ గవర్నర్ వాలర్ సూచన! భోగాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ!

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి.

Select Suryaa Now
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి  : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి.

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను పి ఓ లు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.,వి.,పేర్కొన్నారు. గురువారం స్థానిక బాపట్ల ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026లో భాగంగా ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు) తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. శిక్షణలో అందించిన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రానికి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.
బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని,
పోలింగ్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం మాక్ పోలింగ్ నిర్వహించాలి.
ఓటర్ల గుర్తింపు, ఓటు హక్కు వినియోగం విషయంలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కునువినియోగించుకునేలా చూడాలన్నారు.
పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రికార్డులు, ఫారాలను సక్రమంగా నిర్వహించాలని
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని నిబంధనల ప్రకారం భద్రపరిచి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలిపారు.

కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలని,
కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి.
చెల్లుబాటు అయ్యే, చెల్లని ఓట్లను నిర్దేశిత నిబంధనల ప్రకారం గుర్తించాలి.
ఓట్ల లెక్కింపులో పూర్తి అప్రమత్తత పాటిస్తూ ప్రతి వివరాన్ని రికార్డు చేయాలన్నారు.
ఫలితాల ప్రకటన, సంబంధిత ఎన్నికల పత్రాల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకూడదన్నారు.
ఎన్నికల విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలు ఉంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల రోజున బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో డి పి ఓ.నరేష్ కుమారి,డ్వామా పి డి.ఏ.వి.విజయలక్ష్మి, స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు జిల్లా అధికారి రాజేష్,  మాస్టర్ ట్రైనర్స్, ఎన్నికల విధులకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.