BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

పంచాయతీ టీడీపీ ఏకగ్రీవం.. వార్డుల్లో వైసీపీకి మూడు స్థానాలు.. కలిగిరిలో ఆసక్తికర చర్చ!

Select Suryaa Now
పంచాయతీ టీడీపీ ఏకగ్రీవం.. వార్డుల్లో వైసీపీకి మూడు స్థానాలు.. కలిగిరిలో ఆసక్తికర చర్చ!

పంచాయతీ టీడీపీ ఏకగ్రీవం.. వార్డుల్లో వైసీపీకి మూడు స్థానాలు.. కలిగిరిలో ఆసక్తికర చర్చ!

కలిగిరి, మేజర్ న్యూస్

రాజకీయంగా ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన గడ్డం పకీరయ్య కుటుంబానికి ప్రజల ఆదరణ లభించింది. కలిగిరి మండలం చిన అన్నలూరు గ్రామపంచాయతీ టీడీపీకి ఏకగ్రీవమైనప్పటికీ, వార్డు సభ్యుల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
9వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం పకీరయ్య సతీమణి గడ్డం అరుణ తన ప్రత్యర్థిపై 20 ఓట్ల మెజార్టీతో, 10వ వార్డు నుంచి నేలపాటి సాయి తేజ 24 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.గతంలో ఎలాంటి అధికారిక పదవులు లేకుండానే గడ్డం పకీరయ్య కుటుంబం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ, గ్రామస్థుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు పలకడం గతంలో చేసిన సేవలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా గడ్డం అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, చిన అన్నలూరు పంచాయతీ టీడీపీకి ఏకగ్రీవమైనప్పటికీ, నాలుగు వార్డులకు ఎన్నికలు జరగగా మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం కలిగిరి మండలంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఏకగ్రీవం ఒకవైపు, వార్డు ఎన్నికల్లో వైసీపీకి లభించిన ప్రజా మద్దతు మరోవైపు ఉండటంతో గ్రామ రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అధికారిక పదవులు లేకుండానే ప్రజాసేవ చేసిన కుటుంబానికి ఎన్నికల్లో లభించిన ఆదరణ స్థానికంగా ప్రత్యేక చర్చకు కారణమైంది.