పింగుల మధుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు-2026
టి. నరసాపురం, మేజర్ న్యూస్: ప్రజాసేవ, సామాజిక చైతన్యం, ప్రజల అభ్యున్నతికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా టి. నరసాపురం మండలం గండిగూడెంకు చెందిన పింగుల మధుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ సదస్సులో ఆయనకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు-2026, ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.బహుజన సాహిత్య అకాడమీ జనరల్ సెక్రటరీ నల్ల రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రమణియన్, అధ్యక్షుడు మన్వీర్ సింగ్ చేతుల మీదుగా పింగుల మధు అవార్డును అందుకున్నారు. అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం టి. నరసాపురం ప్రాంతానికి గర్వకారణమని పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త నాజర్ భాష, నారపాము దుర్గారావు, బొక్క శ్రీను, బచ్చల వెంకటేశ్వరరావు, చిన్నం అర్జియా (బుజ్జి), గంధం రామకృష్ణ, కొలుకులూరి రాంబాబు, కారుమంచి కన్నయ్య తదితరులు పింగుల మధుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు,