BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

పెట్రోల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Select Suryaa Now
పెట్రోల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లా లోని అన్ని పెట్రోల్, డీజిల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా లోనిపెట్రోల్ బంక్ యజమానులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వెంకట రాముడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, వినియోగదారులకు సరైన పరిమాణంలో ఇంధనం అందించాలని సూచించారు. ప్రతి పెట్రోల్ బంకులో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారుల సౌకర్యార్థం పెట్రోల్ బంకుల్లో తాగునీరు, మరుగుదొడ్లు, గాలి నింపే యంత్రాలు, ప్రథమ చికిత్స పెట్టె వంటి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వినియోగదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించాలని పెట్రోల్ బంక్ యజమానులకు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ఉత్పత్తుల (లైసెన్సింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లైస్) ఆర్డర్, 1980 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించేందుకు సంబంధిత లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ పి సి ఎల్, ఎస్ ఓ, బి, ఐఓసీఎల్ ఎస్ ఓ ప్రభాకరన్, జిల్లా లోని పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.

 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.