BREAKING
ముంబైలో లగ్జరీ కారు బీభత్సం: మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు కర్ణాటకలో కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: వారం రోజుల పాటు సభ జరపాలని బీజేపీ డిమాండ్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం 50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోలీసులతో ఉత్సవ సమితి సభ్యుల తోపులాట, బారికేడ్ల తొలగింపుతో రణరంగం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి.. పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రెజీనగర్ ఉపఎన్నికలో సంచలనం: పోలీసుల వేధింపులపై ఈసీని ఆశ్రయించిన ఏజేయూపీ చీఫ్ కబీర్, ప్రచారానికి బ్రేక్ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Select Suryaa Now
పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: పిఠాపురం పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన పీఠికాపుర వనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నగర వనంలో మొక్క నాటి, ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు 1.83 కోట్ల రూపాయల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నేడు పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే హరిత ప్రాంతంగా రూపాంతరం చెందింది.
​పిఠాపురానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నగరవనాన్ని ఆహ్లాదం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిర్మించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, రావి, మర్రి, వేప తదితర మొక్కలను ఒక వరుస క్రమంలో నాటగా, ప్రతి మొక్కను ఉప ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. శివ స్వరూపమైన మారేడుతో పాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాల మొక్కలతో శివ పంచాయతనంగా ఏర్పాటు చేశారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు.
​అనంతరం డెబ్బై సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌తో పాటు బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యలో ఉన్న భారీ కొలనును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచి వేగంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మియావకీ పద్ధతిని ఉపయోగించారు. బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ లాంటి మరిన్ని ఆకర్షణలను కూడా ఇక్కడ జోడించనున్నారు. గతంలో డంపింగ్ యార్డుగా ఉన్న ఈ ప్రదేశం నగరవనంగా మారిన వైనాన్ని తెలిపే ఫొటో గ్యాలరీని తిలకించి, ఇందుకు కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పద్దెనిమిది నగర వనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.