పెనుగొండలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
వాసవి పెనుగొండ, మేజర్ న్యూస్: పెనుగొండ గ్రామపంచాయతీలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. నాగరాణి ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు.గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆమె నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ, సంబంధిత రికార్డుల నిర్వహణ, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎమ్మార్వో అనిత కుమారి, ఎంపీడీవో టీఎస్ మూర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు