BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

పెనుగొల్లు సమీపంలో జాతీయ రహదారిపై ఘోరప్రమాదం!

Select Suryaa Now
పెనుగొల్లు సమీపంలో జాతీయ రహదారిపై  ఘోరప్రమాదం!

 

విశాఖ-తుని జాతీయ రహదారిపై ఐషర్ వ్యాన్ దగ్ధం - తప్పిన పెను ప్రమాదం

ఎస్.రాయవరం, నవంబర్ 3, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. చూస్తుండగానే మంటలు వ్యాన్ మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.