BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు: రూ.4.14 లక్షల ఆదాయం

Select Suryaa Now
పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు: రూ.4.14 లక్షల ఆదాయం

నెల్లూరు కల్చరల్/ రాపూరు మేజర్ న్యూస్  :  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో శనివారం శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారికి విశేష అభిషేకం, ఉదయం నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం ప్రధానార్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రదీపాలంకరణ సేవను కనులపండువగా చేపట్టారు. అనంతరం భక్తులు సమర్పించిన 100 గొడుగుల నీడలో స్వామివారి తిరుచ్చి సేవ నేత్రపర్వంగా సాగింది. అన్నదానం తదితర ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
ఈ రోజు వివిధ సేవా టికెట్లు, కానుకలు, ప్రసాదాల విక్రయాల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.4,14,445 ఆదాయం సమకూరిందని ఈవో జనార్దన రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.

బ్యాటరీ వాహనం కొనుగోలు
మరోవైపు, లడ్డూ పోటుశాల నుంచి విక్రయ కౌంటర్లకు ప్రసాదాలను సురక్షితంగా, వేగంగా రవాణా చేసేందుకు దేవస్థానం నూతనంగా బ్యాటరీ వాహనాన్ని కొనుగోలు చేసింది. స్వామివారి సన్నిధిలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, శనివారం నుంచే వినియోగంలోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.