BREAKING
మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం ఏడేళ్ల తర్వాత రాజమహేంద్రవరం కు మహాఎన్నికలు వడ్డే ఓబన్న కళ్యాణ మండపానికి భూమి పూజ. 55 లక్షలు ఎంపీ నిధులతో నిర్మాణం. పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు దేవులనాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి

పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు

Select Suryaa Now
పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు

అనకాపల్లి: పట్టణంలోని  పెద్దవీధిలోని శ్రీ సీతారామ యాత, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఈ నవరాత్రి వేడుకలలో భాగంగా గురు భవానీ యాండ్ర రామకృష్ణ పర్యవేక్షణలో అమ్మవారికి నిత్య పూజలు, విశేష సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు 'శ్రీ గాయత్రీ దేవి' అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో గాయత్రీ అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. ఈ పూజా మహోత్సవంలో సుమారు 100 మంది భవానీ మాలధారులు, శివభక్తులు, సంఘ ప్రతినిధులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి నామస్మరణలు, భవానీల భజనలతో పెద్దవీధి ప్రాంతమంతా ఆధ్యాత్మిక నినాదాలతో మార్మోగింది.

రవికుమార్ 

ఎన్డిపి సూర్య ప్రతినిధి