BREAKING
మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం ఏడేళ్ల తర్వాత రాజమహేంద్రవరం కు మహాఎన్నికలు వడ్డే ఓబన్న కళ్యాణ మండపానికి భూమి పూజ. 55 లక్షలు ఎంపీ నిధులతో నిర్మాణం. పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు దేవులనాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి

గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం

Select Suryaa Now
గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం

ఇబ్రహీంపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం.

చేవెళ్ల : రెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం బస్తేపూర్‌ గ్రామానికి చెందిన బేగరి రాఘవేందర్‌ (37) హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో వంటపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

సోమవారం (అక్టోబర్‌ 12) ఉదయం పనికి వెళ్లిన రాఘవేందర్‌ రాత్రి 8.30 గంటల సమయంలో తన గ్లామర్‌ బైక్‌పై ఇంటికి చేరుకున్నాడు. అనంతరం పాలు తీసుకురావడానికి చేవెళ్ల వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో ఇబ్రహీంపల్లి గేట్‌ సమీపంలోని చాయ్‌ బంక్‌ వద్ద గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి అతని బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రాఘవేందర్‌కు తలతో పాటు కుడికాలు, కుడిచేతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య బేగరి మహేశ్వరి ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

(చేవెళ్ల - మేజర్ న్యూస్)