పెద్ద రంగాపురంలో నీటి సరఫరా సమస్యకు పరిష్కారం
పులివెందుల మేజర్ న్యూస్:పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని పెద్హరంగాపురం గ్రామంలో నీటి సరఫరా మోటారు చెడిపోవడంతో ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ శ్రీమతి తనూజ వెంటనే స్పందించి, చెడిపోయిన మోటారు స్థానంలో కొత్త మోటారును ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామంలో నీటి సరఫరా సమస్య పరిష్కారమైంది. సమస్యను సత్వరం పరిష్కరించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.