BREAKING
గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు.. ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి "ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం * ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి నెల్లూరు ప్రగతి ప్రస్థానం ఆగకూడదు.. షరణి పొంగూరు రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

పెడన నియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ -- కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అభ్యర్థుల ప్రకటన - శొంఠి నాగరాజు

Select Suryaa Now
పెడన నియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ  -- కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అభ్యర్థుల ప్రకటన - శొంఠి నాగరాజు

 

పెడన,మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా ఎలక్షన్ కమిటీ నిర్ణయం తో  పెడన నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలోకి తిప్పుతున్నామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఏపీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర చైర్మన్  శొంఠి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ  పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత విస్తరించడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి లక్ష్యాలతో సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో పెడన నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ అభ్యర్థుల వివరాలు 
కృత్తివెన్ను మండలం: ఉంగరాల రాంబాబుని,
బంటుమిల్లి మండలం: కట్ట నాగేశ్వరరావుని, 
గూడూరు మండలం: మహమ్మద్ అస్లాం ని కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. ఈ సందర్భంగా శొంఠి నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల బాధ్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని సూచించారు.అభ్యర్థుల ఎంపికలో పార్టీ పట్ల నిబద్ధతతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులందరూ సమష్టిగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.