BREAKING
టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ

పేదలకు పట్టాలివ్వాలి

Select Suryaa Now
పేదలకు పట్టాలివ్వాలి

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం శివారు 98 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీ, దళిత పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి, కాలనీ నిర్మించి ఇవ్వాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం సర్వే నిర్వహించి కొంతమంది పేర్లను నమోదు చేసినప్పటికీ, ఇప్పటివరకు వారికి స్థలాలు మంజూరు కాలేదని ఆయన తెలిపారు. కొందరి అభ్యంతరాల కారణంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని అధికారులు దళిత పేదలకు నోటీసులు జారీ చేస్తూ ఇళ్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఫ్రాన్సిస్ ఆరోపించారు. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న పేదలను ఖాళీ చేయించే చర్యలను నిలిపివేయాలని కోరారు.

ప్రభుత్వ పోరంబోకు భూముల్లో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చి, కాలనీలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్థానిక స్థాయిలో అధికారులు, రాజకీయ నాయకులు పేదలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పేదలపై ఒత్తిళ్లు, బెదిరింపులు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.పేదలకు పట్టాలు మంజూరు చేసి, కాలనీ నిర్మాణం చేపట్టాలని, వారి నివాసాలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే దళిత, పేద కుటుంబాలను ఐక్యం చేసి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని ఫ్రాన్సిస్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మరియమ్మ, కుమారి, కంకిపాటి బుల్లెంకమ్మ, కే. ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం