BREAKING
గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

పవన్ కళ్యాణ్ ఆశయాలు… పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం!

Select Suryaa Now
పవన్ కళ్యాణ్  ఆశయాలు… పొంగూరు నారాయణ  మార్గదర్శకత్వంలో 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నూతనంగా ఎన్నికైన జనసేన 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి చొరవ,తక్షణమే స్పందించిన, మున్సిపల్ అధికారులు.  నెల్లూరు నగరం 21వ డివిజన్, అపోలో హాస్పిటల్ జంక్షన్ వద్ద శాంతి స్వీట్స్ పక్కన ఉన్న గుంత కారణంగా స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికుల అభ్యర్థన మేరకు 21వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను అధికారులకు తెలియజేసిన వెంటనే స్పందించిన కమిషనర్,అడిషనల్ కమిషనర్ మరియు సంబంధిత మున్సిపల్ అధికారులు కార్పొరేటర్‌తో చర్చించి కేవలం 24 గంటల వ్యవధిలోనే గుంతను పూడ్చేందుకు చర్యలు తీసుకున్నారు. పైప్‌లైన్ పనుల అనంతరం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రెండు నెలల వ్యవధిలో పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, అప్పటివరకు స్థానికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టడం అభినందనీయమని విజయలక్ష్మి తెలిపారు. “సమస్య ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి” అనే పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవా స్ఫూర్తికి అనుగుణంగా జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని జనసేన నాయకులు కిషోర్ గునుకుల పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందుతున్నాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించిన అడిషనల్ కమిషనర్ హిమబిందు గారికి,  సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, చండ్ర మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.