పసుపం ఎంపీటీసీ స్థానంపై కోట్ల ఎన్నికల ప్రచారం
పూసపాటిరేగ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపై జనసేన దృష్టి సారించింది. కూటమిలో పుత్తులు తేలక పోవడంతో సెంటిమెంటు గా భావించి జనసేన నాయకుడు కోట్ల రఘు పసుపం ఎంపీటీసీ స్థానానికి రఘు సతీమణి రేవతి పోటీ చేయనుండడంతో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం రఘు తో కలిసి రేవతి లాంఛనంగా ప్రారంభించారు. పసుపం సిగ్నెంట్ పరిధిలో ఉన్న ఎరుకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి భారీ ఎత్తున ఊరేగింపుతో గ్రామ పురవీధుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తానంటూ సతీమణి రేవతి తరఫున కోట్ల రఘు ప్రచారం చేశారు. అంతకుముందు రేవతి గ్రామానికి చేరుకోగానే మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.