BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

Select Suryaa Now
లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

నవాబుపేట, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో దుర్గామాత ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, అనంతరం నిర్వహించిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు కోలాటాలతో సందడి చేయగా, భక్తుల జై దుర్గామాత నినాదాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. మహిళల కోలాట ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవారికి వీడ్కోలు పలికారు. అనంతరం సంప్రదాయబద్ధంగా దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వడ్ల శోభ పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వార్డు సభ్యులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

రిపోర్టర్: ఎం.వెంకటేష్, నవాబు పేట్, వికారాబాద్ జిల్లా.