57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 57వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ బరిలో నిలిచారు.
డివిజన్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సుపరిచితురాలిగా గుర్తింపు పొందారు.
ప్రజా సమస్యలపై అవగాహన కలిగి, స్థానికుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న విజయదుర్గకు కూటమి నాయకత్వం అవకాశం కల్పించింది.
ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆమెకు బి-ఫామ్ అందజేసి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేశారు.
కూటమి తరఫున పోటీ చేస్తున్న విజయదుర్గకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో విజయదుర్గ ముందుకు సాగుతున్నారు.
రానున్న ఎన్నికల్లో తనను ఆదరించి, ఆశీర్వదించి విజయాన్ని అందించాలని ఆమె డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్