BREAKING
ఘనంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు.. ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు చెంపపెట్టు ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా భక్తిశ్రద్ధల నడుమ అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు.. కోలాహలంగా శోభాయాత్రలు ఘనంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ అభివృద్ధిని చూడాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు స్థానిక ఎన్నికలపై మంత్రి 'గొట్టిపాటి' సమీక్ష సీపీఎం అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల వేతన సవరణకు కృషి చేస్తా ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం జడ్పీ నామినేషన్ల కుస్తీ పలువురు అభ్యర్థులను అడ్డుకున్న నేతలు... తెలుగుదేశం అభ్యర్థులకు బిఫారాలు పంపిణీ

రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం

Select Suryaa Now
రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం

ఏలూరు, మేజర్ న్యూస్: స్థానిక పత్తేబాద నాలుగు గుళ్ళు సెంటర్‌లో ఉన్న కనకదుర్గమ్మవారి ఆలయంలో 56వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి.శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజైన మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమిసందర్భంగా ఆలయ అర్చకులు రామ్మూర్తి ప్రత్యేక పూజలుచేశారు. రాక్షస సంహారం అనంతరం విజయోత్సవం జరుపుకునే తల్లి దివ్య రూపమే రాజరాజేశ్వరి అనితెలిపారు. ఈ నెల 25వ తేదీన అన్నసమారాధననిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి నల్లూరి సతీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి విశిష్ట అతిధులు ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, స్థానిక 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయుడు సోము శారద విచ్చేయుచున్నారని తెలిపారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు, తగు జాగ్రత్తలు తీసుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పృధ్వి సత్యనారాయణమూర్తి, కార్యనిర్వాహణాధికారి నల్లూరి సతీష్ కుమార్, కార్యనిర్వాహకులు బాబీ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పోలినాటి సత్తిరెడ్డి, కపిలవాయి రాజేశ్వర కుమార్, అడ్డాల వెంకటేశ్వరరావు, బొమ్మన హేమలత, కంచోటి దుర్గ, ఉమామహేశ్వరి, పొన్నాడ వెన్నెల, పీవీ రామమూర్తి(అర్చక) ఎక్స్ అఫీషియో మెంబర్, తదితరులు పాల్గొన్నారు.