telangana
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం
సూర్య కరీంనగర్ మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన గంగిపల్లి గ్రామం నివాసి ముక్కెర సతీష్ కుమార్ ను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్,పూర్వ జిల్లా జనరల్ సెక్రెటరీ కాటా నర్సయ్య గౌడ్,పిఆర్టియు స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు ఆరెల్లి కుమారస్వామి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. 2019 నుండి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గాను,2025 నుండి యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఇట్టి అవకాశాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో ముల్కల దిలీప్ కుమార్,ప్రేమ్,నవీన్ పాల్గొన్నారు.