telangana
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల వేతన సవరణకు కృషి చేస్తా ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సూర్య కరీంనగర్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల మూడవ వేతన సవరణను తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కోరుతూ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ (AUAB) ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. 2017 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను అఫర్డబిలిటీ క్లాజ్ పేరుతో నిలిపివేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని వివరించారు. వేతన సవరణ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్, ఉద్యోగుల సమస్యను కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SNEA జిల్లా కార్యదర్శి బండారి సంతోష్ కుమార్, BSNLEU జిల్లా కార్యదర్శి ఎస్. సత్తయ్య, SEWA జిల్లా అధ్యక్షుడు జి. కిషన్, NFTE జిల్లా కార్యదర్శి సిహెచ్. లింగాచారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.