బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పార్కింగ్ లోని ఏపీ 39 యుఎక్స్ 9333 అశోక్ లేలాండ్ బస్సు చోరీకి గురైంది. బస్సు యజమాని ఎన్.వెంకటేశ్వరరావు అందించిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి- విజయవాడ హైర్ బస్సు
ఈనెల 20వ తేదీ రాత్రి యధావిధిగా బస్సును బస్టాండ్ ప్రాంగణంలో డ్రైవర్ పార్కింగ్ చేశాడు. గురువారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో డ్రైవర్ బస్టాండులో వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. దీంతో ఆయన బస్సు యజమాని వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థానానికి చేరుకొని చుట్టుపక్కల అంతా వెతికారు. బస్సు ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 46 లక్షలు రూపాయలు బస్సు విలువ ఉంటుందని యజమాని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఈస్ట్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్