BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

*తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర*

Select Suryaa Now
*తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర*

తూప్రాన్;తూప్రాన్ పట్టణంలో దుర్గాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని అమ్మవారి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించిన అమ్మవారి శోభాయాత్ర భక్తిభావంతో, ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న అమ్మవారిని పదో రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగించి, పెద్ద చెరువు కట్ట వద్ద గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. అక్కడి నుంచి పాత మున్సిపల్ కార్యాలయం, నూతన మున్సిపల్ కార్యాలయం, హైస్కూల్, శివాలయం మీదుగా అమ్మవారి ఊరేగింపు సాగింది. అనంతరం సినిమా థియేటర్ రోడ్డు, వినాయక్ నగర్, గాంధీనగర్ మెయిన్ రోడ్డు మీదుగా పెద్ద చెరువు కట్ట వరకు శోభాయాత్ర కొనసాగింది. అమ్మవారి శోభాయాత్రలో భజన బృందాల భక్తి గీతాలు, డీజే సౌండ్‌లతో మార్మోగిన ఆధ్యాత్మిక నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత అమ్మవారి మాలధారణతో భక్తిపారవశ్యంలో పాల్గొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య సాగిన ఊరేగింపు పట్టణ ప్రజల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు, ఉత్సవాల ముగింపు రోజున ఘనంగా శోభాయాత్ర చేపట్టి సంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం పెద్ద చెరువు కట్ట వద్ద గంగమ్మ ఒడిలో అమ్మవారిని నిమజ్జనం చేయడంతో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి.అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ మామిండ్ల కృష్ణ ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ రామరాజు, వెంకట గోపాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్, రిటైర్డ్ ఎస్సై విద్యాసాగర్, రిటైర్డ్ వార్డెన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు చేసిన ఏర్పాట్లతో శోభాయాత్ర విజయవంతంగా ముగిసింది.