పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు
చుంచుపల్లి, సూర్య ;దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు అమరవీరులకు జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒక ప్రకటనలొ నివాళులర్పంచారు.పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు.
పోలీసు అధికారి విధులకు వెళ్లినప్పుడు తిరిగి వస్తాడని ఎదురుచూసే తల్లి, క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఆశించే భార్య, నాన్న రాక కోసం ఎదురుచూసే పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబాల్లో తీరని విషాదం, చెరిగిపోని జ్ఞాపకాలు, జీవితాంతం వెంటాడే వేదన మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబాల ప్రేమానురాగాలను పక్కనపెట్టి ప్రజల భద్రతను కర్తవ్యంగా భావించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి ధైర్యసాహసాలు, సేవా స్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.