ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
భట్టిప్రోలు మండలం, పల్లికోన ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన వేములపల్లి రఘునాథ్ బాబు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మండల ఎన్నికల అధికారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. దేవలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లికోన ఎంపీటీసీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుంటామని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నామినేషన్ కాక మూడు జనసేన పార్టీ తరఫున, మరో నాలుగు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.