BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం

Select Suryaa Now
జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం

బుచ్చిరెడ్డిపాళెం, మేజర్ న్యూస్ :    బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  జనంలో ఉంటూ ప్రజల కోసం పనిచేసే సమర్థులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చారని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  తెలిపారు. బుధవారం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 6, 7, 8 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే .. రెండున్నరేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం పరిస్థితులు ఎలా ఉండేవో, ప్రస్తుతం ఎలాంటి మార్పులు వచ్చాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారితో పాటు, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బిట్రగుంట సరోజనమ్మ గారు, 7వ వార్డు అభ్యర్థి నెల్లూరు దయాకర్ రెడ్డి , 8వ వార్డు అభ్యర్థి కత్తి మహేష్ గారిని ప్రజలకు పరిచయం చేస్తూ వారి విజయానికి కృషి చేయాలని కోరారు.

రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు.. కోడ్ ముగియగానే పూర్తి చేస్తాం

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ సహకారంతో సుమారు రూ.22 కోట్లతో వివిధ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పనులను కోడ్ ముగిసిన వెంటనే తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో రహదారుల సమస్యలను పరిష్కరించి, గుంతలు లేని మెరుగైన రోడ్లు అందించడమే లక్ష్యమని చెప్పారు. స్థానిక వ్యాపారులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన పీ4 మార్కెట్ పట్టణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. మార్కెట్‌లో అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలను సరిదిద్దేందుకు కృషి
మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి గారు వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో బ్యాంకులో గతంలో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకలను సరిదిద్దేందుకు రెండేళ్లపాటు కృషి చేశారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  తెలిపారు. నీతి, నిజాయతీకి ప్రాధాన్యం ఇచ్చే దొడ్ల కుటుంబం నుంచి వచ్చిన విజయలక్ష్మి కి మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగిస్తే ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలన అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తనతో కలిసి పనిచేస్తారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపే బాధ్యతాయుతమైన నాయకత్వం పట్టణానికి అవసరమని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యం
రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ అర్హులైన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, మహిళలకు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల సేవలో, నేతన్నల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని వివరించారు.

రైతుల హక్కులు, వ్యవసాయ అవసరాలపై ప్రత్యేక దృష్టి
కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం కావడంతో రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే  తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను రైతులకు అందించామని చెప్పారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, నీటి సరఫరా కల్పిస్తూ రైతులు పుష్కలంగా పంటలు పండించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

కూటమి ఐక్యతే విజయానికి బలం  
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో కూటమి ధర్మానికి అనుగుణంగా 22 వార్డులను తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ పార్టీలకు మూడు చొప్పున కేటాయించినట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  తెలిపారు. మూడు పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారం విజయానికి కీలకమని పేర్కొన్నారు. 7వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు దయాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నమ్మకంతో ఎంపిక చేశారని తెలిపారు. 6, 8 వార్డుల్లో జనసేన తరఫున బిట్రగుంట సరోజనమ్మ, కత్తి మహేష్ గార్లు పోటీ చేస్తున్నారని చెప్పారు. అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారనే భేదాలు పక్కనపెట్టి, కూటమి అభ్యర్థులందరినీ తమ అభ్యర్థులుగా భావించాలని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన గుర్తింపు, పదవులు కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే నాయకత్వం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి అవసరమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  పేర్కొన్నారు.