వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు
శ్రీకాకుళం, సూర్య : జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి / ఎదురుదెబ్బ తీసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు సైకిల్ ఎక్కారు. ఈ మేరకు తోణంగి గ్రామ సర్పంచ్ నగిరెడ్ల లక్ష్మణ రెడ్డి వైకాపాను వీడి ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో చేరారు.
సర్పంచ్ లక్ష్మణ రెడ్డితో పాటుగా, లంకాం పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రుప్ప నూకరాజు కూడా తన అనుచరగణం, సుమారు 20 కుటుంబాలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పార్టీలో చేరిన సర్పంచ్ లక్ష్మణ రెడ్డి, వార్డు సభ్యుడు నూకరాజు తదితరులకు స్వయంగా పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి పాత, కొత్త కలయికతో ప్రతి ఒక్కరూ సైనికుల్లా సమిష్టిగా పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.