BREAKING
మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కుంభం* అక్టోబర్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

అధికారులకు ఎన్నికల శిక్షణ

Select Suryaa Now
అధికారులకు ఎన్నికల శిక్షణ

అమలాపురం మేజర్ న్యూస్ ;ఎంపీటీసీ, జడ్పిటిసి  ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే తమ సందేహాలను ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవనం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ సమావేశం నందు రెండవ సాధారణ ఎన్నికల ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ పై తమ సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ పాల్గొని ఎన్నికల విధివిధానాలు, పోలింగ్ నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రిసైడింగ్ అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన
శిక్షణ తరగతుల్లో భాగంగా ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించాల్సిన విధులు, పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించే విధానం తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్స్ వివరించారు.
నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ
ఎన్నికల విధుల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత పొందేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది.పారదర్శకంగా, సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
గోదావరి భవన్‌లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఎం మురళీకృష్ణ, మాస్టర్ ట్రైనర్స్ ఏ సాయి రామ్ ఎన్ సుధాకర బాబు ఏ శశి కుమార్ కే మురళీధర్ కేవీపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.