BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ

Select Suryaa Now
గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ

గాజువాక, సూర్య : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వైకాపా మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి బుధవారం గాజువాక నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డిలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ భేటీలో ప్రధానంగా గాజువాక నియోజకవర్గ పరిధిలోని వార్డుల వారీ వివరాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. జీవీఎంసీ పరిధిలో మేయర్ స్థానంతో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమష్టిగా కృషి చేసి, సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా వరుదు కళ్యాణి వారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డిలు మాట్లాడుతూ.. గాజువాకలో అత్యధిక వార్డులతో పాటు మేయర్ ఓటింగ్ శాతం కూడా కచ్చితంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.