పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారం సందడిగా సాగింది. మండలంలోని మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ 10 ఎంపీటీసీ సెగ్మెంట్లలకుగాను మొత్తం 23 నామినేషన్లు రాగా అందులో టీడీపీకి చెందిన 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వైసీపీకి చెందిన వారు 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ విజయకుమార్ తెలిపారు. పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. నేడు, రేపు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని 24వ తేదీ నామినేషన్ల స్క్రూట్ని జరుగుతుందన్నారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై శివరాకేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నెల్లూరు ఏఎస్పీ సౌజన్య, రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు నామినేషన్ల కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల దాఖలుతో మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కగా, రానున్న రోజుల్లో వివిధ స్థానాల్లో రాజకీయ పోటీ ఎలా ఉండబోతోందన్న అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.