BREAKING
వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కుంభం*

నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి.

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి.

ముత్తుకూరు మేజర్ న్యూస్ :   ముత్తుకూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ జి. శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబుతో ఆయన మాట్లాడి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అనుసరిస్తున్న విధానాలు, కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల సన్నద్ధతపై చర్చించారు. అలాగే నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా చర్యలపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ తనిఖీలో స్థానిక ఎస్సైలు కొండారెడ్డి, జేపీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.