ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి
కందుకూరు: శంషాబాద్‌లోని మల్లికార్జున గార్డెన్స్‌లో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమ సమావేశానికి కందుకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియపై ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి మెజారిటీ సాధించే దిశగా సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
టి శ్రీనివాస్ ,మేజర్ న్యూస్.