BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

Select Suryaa Now
పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

విజయనగరం, సూర్య : స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యయ పరిశీలకులు ఎస్. వెంకటేష్ సూచించారు. నిర్దేశించిన పరిమితికి మించి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఆయన మంగళ, బుధవారాల్లో జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బుధవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం గంట్యాడ, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పర్యటించారు. మండల అకౌంటింగ్ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

           ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు వెంకటేష్ మాట్లాడుతూ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి రూ.25 లక్షలు, వార్డు సభ్యుల అభ్యర్థులకు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ.20 లక్షలు, వార్డు సభ్యుల అభ్యర్థులకు రూ.7.50 లక్షలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ.10 లక్షలు, వార్డు సభ్యుల అభ్యర్థులకు రూ.5 లక్షలుగా వ్యయ పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు.
       
            మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955లోని సెక్షన్ 617-బి(1), రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ప్రతిరోజూ ఎన్నికల ప్రచారానికి చేసిన ఖర్చులను నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేయాలని సూచించారు. వాహనాల ఖర్చులు, ర్యాలీలు, మైకులు, జెండాలు, టోపీలు, వార్తాపత్రికల్లో ప్రకటనలు తదితర అన్ని వ్యయ వివరాలను ప్రొఫార్మా-I, II, III, IVలలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

              అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తరఫున ఇతరులు చేసిన ఖర్చులను కూడా అభ్యర్థి ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తామని తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులకు ఎన్నికల నియమావళితో పాటు వ్యయ రిజిస్టర్లు, సంబంధిత ప్రొఫార్మాలను అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అవి అందకపోతే వ్యయ పరిశీలకుల బృందాన్ని సంప్రదించాలని సూచించారు.

     ఎన్నికల తుది ఫలితాల ప్రకటనకు ముందు వ్యయ పరిశీలకుల బృందం కనీసం మూడు పర్యాయాలు అభ్యర్థుల ఖర్చుల వివరాలను తనిఖీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22, 25, 27 తేదీల్లో సంబంధిత కమిషనర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలతో కూడిన రిజిస్టర్లు, సంబంధిత బిల్లులు, వోచర్లతో తనిఖీకి హాజరుకావాలని సూచించారు. ఖాతాల తనిఖీ సమయంలో ఏవైనా లోపాలు గుర్తించి నోటీసులు జారీ చేస్తే, వాటికి నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా, అంటే డిసెంబర్ 13, 2026లోపు, అభ్యర్థులు తమ తుది ఎన్నికల వ్యయ ఖాతాలను సంబంధిత కమిషనర్ కార్యాలయంలోని సహాయ వ్యయ పరిశీలకులకు తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఎన్నికల వ్యయ నిబంధనలు పాటించకపోయినా, నిర్ణీత గడువులోగా తుది ఖాతాలు సమర్పించకపోయినా ఎన్నికల నిబంధనల ప్రకారం మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని జిల్లా వ్యయ పరిశీలకులు ఎస్. వెంకటేష్ హెచ్చరించారు. ఆయనవెంట జిల్లా ఆడిట్ అధికారి కె.ఆదినారాయణ ఉన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.