పరిటాల రవి ఘాట్ వద్ద నివాళులర్పించిన ధర్మవరం తెదేపా నాయకులు ధర్మవరం:
ధర్మవరం:
ధర్మవరం మున్సిపల్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పరిసే సుధాకర్ పట్టణ తెదేపా నాయకులు కమతం కాటమయ్య బీమునేని ప్రసాద్ పురుషోత్తం గౌడ్ మాధవరెడ్డి ఈరోజు ఉదయం శుక్రవారం వెంకటాపురంలోని మాజీ మంత్రి, కీర్తిశేషులు పరిటాల రవీంద్ర ఘాట్ను సందర్శించారు. పరిటాల రవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు, పట్టణంలోని 48 వార్డుల నుండి పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పరిటాల రవి ఆశీస్సులు తీసుకున్నారు